Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒకటీ రెండూ కాదు, యాభై సినిమాలు వదులుకున్న ‘ఘాజీ’ సినిమాటోగ్రాఫర్!

ప్రముఖ నటుడు మహేష్ బాబు నటించిన సూపర్ డూపర్ హిట్ చిత్రం ‘శ్రీమంతుడు’కు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన మధీ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. ఈ చిత్రం తర్వాత సుమారు 50 చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసే అవకాశాలు తనకు వచ్చాయని, అయితే, ‘ఘాజీ’కు పని చేస్తానని అప్పటికే ఒప్పుకోవడంతో ఆ చిత్రాలకు ‘నో’ చెప్పాల్సి వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా ‘ఘాజీ’ చిత్రీకరణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నది, ఎంత కష్టపడింది చెప్పారు. కాగా, ఘాజీ చిత్రంపై ఇప్పటికే ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు రాజకీయ రంగానికి చెందిన వారు ప్రశంసలు కురిపిస్తున్నారు.

More Telugu News